‘నేను పరమశివుణ్ణి.. నిన్ను చంపి మళ్లీ బతికిస్తా’ అంటూ వృద్ధురాలి హత్య

Rajasthan man claims to be god shiva kills woman after promising to ressurect her
  • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • తాగినమైకంలో 70 ఏళ్ల వృద్ధుడి ఘాతుకం
  • ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు మైనర్లు, మరో వ్యక్తి
  • దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరణ
  • పోలీసుల అదుపులో నిందితులు
తాగిన మైకంలో ఓ వృద్ధుడు రెచ్చిపోయాడు. తాను పరమశివుడినంటూ ఊగిపోయిన అతడు వృద్ధురాలిని చంపి మళ్లీ బతికిస్తానంటూ దారుణానికి తెగబడ్డాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించి పొట్టనపెట్టుకున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోని గోగుండా తహసీల్ పరిధిలో ఈ ఘోరం వెలుగు చూసింది. 

పూటుగా మద్యం తాగిన నిందితుడు ప్రతాప్‌సింగ్(70) అటుగా వెళుతున్న కల్కిబాయ్ గమేతి(85) అనే వృద్ధురాలిపై తన ప్రతాపం చూపించాడు. తాను శివుడిని అంటూ ఊగిపోయి మహిళ ఛాతిపై పిడిగుద్దులు కురిపించాడు. దెబ్బలకు తాళలేక కింద పడిపోయిన ఆమెను గొడుగుతో చితకబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఘటన సమయంలో అక్కడ ప్రతాప్ సింగ్‌తో పాటూ ఇద్దరు మైనర్లు, నాథూసింగ్ అనే మరో వ్యక్తి ఉన్నారు. వారిలో ఒకరు ఈ దారుణ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించారు. కాగా, వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్ ఎస్పీ భువన్ భూషన్ తెలిపారు.
Go Back to Shorts
Rajasthan
Crime News

More Telugu News