మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
- బీజేపీ అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదన్న విజయసాయిరెడ్డి
- బాబుది స్క్రిప్ట్.. వదినది డైలాగ్ అంటూ మండిపాటు
- తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్లలో ఆనందమే టార్గెట్ అంటూ విమర్శలు
‘‘మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు.. అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!” అంటూ మండిపడ్డారు. 2013లో పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సంబంధించి పురందేశ్వరి గతంలో చేసిన ప్రకటనను షేర్ చేశారు.