ఇక్కడ కూడా తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. భారతీయ సినీ పరిశ్రమలో తిరుగులేని రికార్డు!

Allu Arjun followers in Threads crosses 1 million
  • సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు భారీగా పెరిగిపోతున్న ఫ్యాన్స్
  • థ్రెడ్స్ యాప్ లో 1 మిలియన్ ఫాలోయర్లను సొంతం చేసుకున్న బన్నీ
  • ఈ యాప్ లో మిలియన్ ఫాలోయర్లను కలిగిన ఇండియన్ స్టార్ బన్నీ మాత్రమే
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. తాజాగా మన సినీ పరిశ్రమలో ఏ స్టార్ కూడా సాధించని రికార్డును బన్నీ సాధించాడు. 

ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ 'థ్రెడ్స్'ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ లో అల్లు అర్జున్ అప్పుడే 1 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇండియాలో మరే సినీ స్టార్ కూడా ఈ ఘనతను సాధించలేదు. వన్ మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న తొలి సినీ నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. 

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Go Back to Shorts
Allu Arjun
Tollywood
Threads App

More Telugu News