ఢిల్లీకి చేరుకున్న పవన్ కల్యాణ్.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు
- మంగళవారం నాటి ఎన్డీయే సమావేశానికి పవన్ కల్యాణ్
- ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశముందని వెల్లడి
- ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైనా చర్చిస్తామన్న జనసేనాని
2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని.. ఆ సమయంలో కలిశానని, 2019లో వేర్వేరుగా పోటీ చేశామని గుర్తు చేశారు. మంగళవారం నాటి భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై ఈ భేటీలో చర్చిస్తామన్నారు. ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలనే అంశంపైనా చర్చిస్తామన్నారు.