పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు
- జనసేన తీర్థం పుచ్చుకున్న ఆమంచి స్వాములు
- కండువా కప్పి జనసేనలోకి స్వాగతించిన పవన్ కల్యాణ్
- పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచన
ఆమంచి స్వాములు ఇవాళ బాపట్ల జిల్లా పందిళ్లపల్లి నుంచి భారీ అనుచరవర్గంతో మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చారు. చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ రెండు పర్యాయాలు గెలవడంలో ఆయన అన్న ఆమంచి స్వాములు పాత్ర కీలకం. అయితే ఇప్పుడు ఆమంచి కుటుంబంలో తమ్ముడు వైసీపీలో ఉండగా, అన్న జనసేన పక్షాన చేరారు.