రెమ్యునరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగ్, కాల్షీట్లు: మంత్రి వేణు
Add ap7am to your home Screen

రెమ్యునరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగ్, కాల్షీట్లు: మంత్రి వేణు

Minister chelluboina venu on pawan kalyan
  • జనసేనాని డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపణ
  • పవన్ హాలీడే టూర్ చేస్తున్నారని విమర్శలు
  • చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడానికి స్క్రిప్ట్ చదువుతున్నారని వ్యాఖ్య
రెమ్యునరేషన్ ను బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ డైలాగ్‌లు, కాల్షీట్లు ఉంటాయని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు శుక్రవారం విమర్శలు గుప్పించారు. జనసేనాని డబ్బుల సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ ఇప్పుడు హాలీడే టూర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ఏమాత్రం అవగాహన లేకుండా, అహంకారంతో పవన్ మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడానికి ప్రజల్లోకి వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు.

పవన్ తన ఫామ్ హౌస్ లో ఉంటే సచివాలయ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పవన్ కు నిలకడ లేదని, ఓపిక కూడా లేదన్నారు. పవన్ తన పిచ్చి మాటలతో ప్రజల నమ్మకం పోయేలా నడుచుకోవద్దని సూచించారు. అబద్ధానికి పవన్ కల్యాణ్ ఆసరాగా నిలిచారని నిందించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు నాలుగైదు రోజులుగా దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే.
Advertisement
chelluboina venu
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News