పవన్ పై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నాం: జనసేన
- పవన్, అన్నా లెజ్నెవా విడిపోయారంటూ కథనాలు
- చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న జనసేన లీగల్ సెల్
- అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాల పేర్లు వెల్లడి
పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు, వారి అనుబంధ యూట్యూబ్ చానల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని తెలిపింది. ఈ మేరకు వైసీపీకి చెందిన కొన్ని అసభ్యకర ఖాతాల వివరాలు అంటూ జనసేన పార్టీ ఓ జాబితాను పంచుకుంది. అందులో కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.