అదే జరిగితే పార్టీని మూసేసుకుంటావా?: పవన్‌కు వెల్లంపల్లి సవాల్

vellampalli srinivas slams pawan kalyan
  • పవన్‌ పగటి కలలు కంటున్నారన్న వెల్లంపల్లి
  • అసెంబ్లీ గేటు దాటే అర్హత కూడా పవన్‌కి లేదని విమర్శ
  • ఒక్కచోటా గెలవని వ్యక్తి సవాల్‌ విసురుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు చేశారు. పవన్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే పవన్‌ పార్టీ మూసేసుకొని వెళ్తావా? అంటూ సవాల్‌ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము పవన్‌కి ఉందా? అని ప్రశ్నించారు.

‘‘ఎమ్మెల్యే కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్‌కి లేదు. ఒక్కచోట కూడా గెలవని వ్యక్తి సవాల్‌ విసురుతుంటే నవ్వొస్తోంది” అని ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మమ్మల్ని ఓడించడం సంగతి తర్వాత.. ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలని సెటైర్లు వేశారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌పై ఈర్ష్యపు మాటలు ఆపకపోతే పవన్‌కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Go Back to Shorts
Vellampalli Srinivasa Rao
Pawan Kalyan
Godavari Districts
Janasena
YSRCP

More Telugu News