మహారాష్ట్రలో బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది సజీవ దహనం
- ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు
- తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన
- గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం
ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.