'కింగ్ ఆఫ్ కోటా' టీజర్ విడుదల చేసిన మహేశ్ బాబు... "అన్నా" అంటూ స్పందించిన దుల్కర్ సల్మాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కింగ్ ఆఫ్ కోటా' టీజర్ విడుదల చేసిన మహేశ్ బాబు... "అన్నా" అంటూ స్పందించిన దుల్కర్ సల్మాన్

Mahesh Babu releases King Of Kotha teaser
  • దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా కింగ్ ఆఫ్ కోటా
  • అభిలాష్ జోషి దర్శకత్వంలో చిత్రం
  • టీజర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్న మహేశ్ బాబు
  • థాంక్యూ సో మచ్ అన్నా అంటూ దుల్కర్ సల్మాన్ కృతజ్ఞతలు
దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం 'కింగ్ ఆఫ్ కోటా'. తాజాగా ఈ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. 'కింగ్ ఆఫ్ కోటా' టీజర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. 

దుల్కర్ సల్మాన్ ను మరోసారి ఆకట్టుకునే పాత్రలో చూస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యావత్ చిత్రబృందానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. 

'కింగ్ ఆఫ్ కోటా' చిత్రం టీజర్ ను మహేశ్ బాబు విడుదల చేయడం పట్ల దుల్కర్ సల్మాన్ స్పందించారు. "థాంక్యూ సో మచ్ అన్నా" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు వంటి అగ్రహీరో తమ చిత్రం టీజర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 'కింగ్ ఆఫ్ కోటా' చిత్రబృందం అంతా ఇప్పుడు సంతోషంతో పొంగిపోతుందని దుల్కర్ సల్మాన్ వివరించారు. 

ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకుడు. ఇందులో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్ ఇతర నటీనటులు. 'కింగ్ ఆఫ్ కోటా' చిత్రంలో దుల్కర్ ఓ గ్యాంగ్ స్టర్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం 80, 90వ దశకాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్టు సమాచారం.
Advertisement
King Of Kotha
Teaser
Mahesh Babu
Dulquer Salmaan

More Telugu News