YS Jagan: నాలుగేళ్లకు ఓసారి భార్యను మార్చే పేటెంట్ ఆయనకే ఉంది.. పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు

YS Jagan fires on pawan kalyan at Kurupam Amma Vodi ceremony
  • లారీ ఎక్కి రాష్ట్రంలో తిరుగుతున్నాడంటూ కురుపాం సభలో విసుర్లు
  • పూనకం వచ్చినట్లు ఊగుతూ మాట్లాడతాడని వ్యంగ్యం
  • రౌడీలా మీసాలు మెలేస్తూ తొడలు కొడుతున్నారంటూ విమర్శ
  • తనకు నచ్చని వాళ్లను చెప్పుతో కొడతానంటూ బెదిరిస్తాడన్న సీఎం
నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చే పేటెంట్ ప్యాకేజీ స్టార్ కే ఉందంటూ పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కురుపాంలో ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు, గిరిజనులకు మేలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత పాలనలో ఏనాడూ ప్రభుత్వాన్ని ఒక్క విమర్శ చేయని దత్తపుత్రుడు ఈరోజు లారీ ఎక్కి రాష్ట్రంలో తిరుగుతూ విమర్శలు గుప్పిస్తున్నాడని మండిపడ్డారు.

‘పద్నాలుగేళ్లు సీఎంగా ఉండికూడా ఏమీచేయని ఓ నాయకుడు.. ఆ నాయకుడి కోసం పదిహేనేళ్ల కిందట పుట్టిన ఓ దత్తపుత్రుడు.. వీళ్లు టీడీపీ అనే తినుకో, దోచుకో, పంచుకో అనే పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ, బొజ్జలు పెంచుకుంటూ బొజ్జ రాక్షసిలా పత్రికలు, వారి టీవీలు.. ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తున్నాయి’ ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

‘ఓ లారీ.. దానిపేరు వారాహి అట.. అది ఎక్కి మామూలుగా కూడా మాట్లాడడు. ఊగిపోతూ మాట్లాడుతుంటాడు. తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం, తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపిస్తాడు. తాటతీస్తానంటాడు.. ఈ మనిషికి మాటకు నిలకడ లేదు, మనిషికీ నిలకడ లేదు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. వీటన్నిటికీ పేటెంట్ వారికే ఉంది. వారిలా ఇలాంటివేమీ మనం చేయలేం. మన పునాదులు పేదల పట్ల ప్రేమ నుంచి, రైతుల నుంచి వారి మమకారం నుంచి పుట్టాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల బాధ్యత నుంచి పుట్టాయి’ అంటూ పవన్ కల్యాణ్ పై జగన్ మండిపడ్డారు.
YS Jagan
Pawan Kalyan
Kurupam
Amma Vodi ceremony
Andhra Pradesh

More Telugu News