3 వేల మంది ఉద్యోగులపై ఫోర్డ్ వేటు!
- అమెరికా, కెనడాలోని ఉద్యోగుల తొలగింపు
- ఉన్నత స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం
- నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతోనే నిర్ణయం
కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎక్కువమంది ఉన్నతస్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు అనుకున్నంతగా డిమాండ్ లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.