పవన్ కల్యాణ్ ద్వారా ఓట్లు చీల్చాలన్న చంద్రబాబు పాచిక పారలేదు: మంత్రి కొట్టు
- జనసేనాని వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శ
- పవన్ వ్యాఖ్యలు ఉన్మాదానికి తక్కువ.. పిచ్చికి ఎక్కువ అని ఎద్దేవా
- ద్వారంపూడి విసిరిన సవాల్ కు తోకముడిచాడన్న మంత్రి
- పవన్ గ్రాఫ్ పదింతలు పడిపోయిందన్న మంత్రి కొట్టు
వారాహితో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పదింతలు పడిపోయిందన్నారు. ఆయన సభకు వచ్చే జనాలు వేల సంఖ్య నుండి వందలకు పడిపోతోందన్నారు. పవన్ కల్యాణ్ ద్వారా గోదావరి జిల్లాలో కాపు ఓట్లను చీల్చాలన్న చంద్రబాబు పాచిక పారలేదన్నారు. కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ముద్రగడ పద్మనాభంపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు.