మహేశ్ బాబు అభిమాని చెప్పిన మాటతో చాలా ఆనందం కలిగింది: పవన్ కల్యాణ్
- రాజోలు నియోజకవర్గంలో వారాహి యాత్ర
- మలికిపురంలో బహిరంగ సభ
- సభకు వస్తుంటే మహేశ్ బాబు అభిమాని కలిశాడన్న పవన్
- మహేశ్ బాబు అభిమాని జనసేనకు ఓటేస్తానని చెప్పాడని వెల్లడి
తనకు టాలీవుడ్ హీరోలందరూ ఇష్టమేనని తెలిపారు. తనకు హీరోలందరూ ఎందుకు ఇష్టం అంటే... వారు ఒక్క సినిమా చేయడం ద్వారా 600 మందికి పైగా ఉపాధి కల్పిస్తారని పవన్ వెల్లడించారు. ఆ హీరోలు జీఎస్టీ కడతారు, ఇతరులకు సాయం చేస్తారు అని కొనియాడారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. జగన్ రెడ్డికి ఒకటే చెబుతున్నా... మీరు ఇప్పటివరకు రాజకీయ నేతలను చూసి ఉంటారేమో... కానీ నాలాంటి విప్లవపంథా ఉన్న నాయకుడ్ని మాత్రం చూసి ఉండరు... నన్ను భయపెట్టాలని ప్రయత్నించకండి... నా పేరు పవన్ కల్యాణ్... నాది జనసేన అంటూ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఇది గోదావరి ప్రాంతం... పులివెందుల హింసను ఇక్కడికి తీసుకురావద్దు అని స్పష్టం చేశారు.