Pawan Kalyan: వారాహి యాత్ర... కత్తిపూడిలో పవన్ కల్యాణ్ తొలి బహిరంగ సభ

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం జనసేన ఎన్నికల యాత్ర షురూ కానుంది. 

కాగా, వారాహి యాత్రలో తొలి బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14న తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కత్తిపూడి బస్టాండ్ సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ఈ సభ జరగనుంది. 

తొలుత తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.
Pawan Kalyan
Varahi Yatra
Kathipudi
Janasena

More Telugu News