వచ్చే 48 గంటల్లో బలపడనున్న బిపర్‌జోయ్ తుపాను
- గోవాకు పశ్చిమ నైరుతిగా 860 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
- మున్ముందు మరింత బలపడనున్న తుపాను
- లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రపై ప్రభావం
తుపాను బలపడనున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్దమైంది. ఈ నెల 14 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలో రేపటి నుంచి 11వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రపై ఉంటుందని వివరించింది.