అదిరే స్టైల్ అయ్యా.. భోళా మేనియా మొదలైందయ్యా..
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదిరే స్టైల్ అయ్యా.. భోళా మేనియా మొదలైందయ్యా..

Bhola shankar first single Bholaa Mania promo out
  • భోళా శంకర్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల
  • ఈ సాయంత్రం 4.05కి పూర్తి లిరికల్ సాంగ్
  • స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్న మెగాస్టార్
వాల్తేరు వీరయ్య విజయంతో  ఫుల్ జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస పోస్టర్లు, అప్ డేట్స్ తో చిత్ర బృందం.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఈ ఉదయం విడుదల చేసింది. అదిరే స్టైలయ్యా.. పగిలే స్వాగ్ అయ్యా.. యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా అంటూ సాగే పాటలో చిరు సూపర్ లుక్ లో కనిపిస్తున్నారు. 

తన మార్కు స్టెప్పుతో కిక్‌ ఇచ్చారు. ఈ మాస్ బీట్ పూర్తి లిరికల్ సాంగ్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతుంది. కీర్తి సురేశ్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తోంది. చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది.
Advertisement
Chiranjeevi
bhola shankar
movie
first single
Bholaa Mania
song

More Telugu News