శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రాంచరణ్ సందడి
- జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో హీరో వివాహం
- సంగీత్ వేడుకల్లో సందడి చేసిన హీరోలు రాంచరణ్, అఖిల్, రానా
- రాత్రి 11:30 గంటలకు రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్న శర్వానంద్
పెళ్లి వేడుకల కోసం లీలా ప్యాలెస్ ను సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు శర్వానంద్, వధువు రక్షిత కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధుమిత్రులు శుక్రవారం ఉదయానికే జైపూర్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేయనున్నాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితతో శర్వానంద్ కు జనవరి 26న ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే.