జైపూర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన హీరో శర్వానంద్ పెళ్లి వేడుక
- రక్షితా రెడ్డిని పెళ్లాడబోతున్న శర్వానంద్
- జైపూర్ లోని లీలా ప్యాలస్ లో మొదలైన పెళ్లి వేడుక
- కాసేపట్లో ప్రారంభం కానున్న మెహందీ ఫంక్షన్
శర్వానంద్, రక్షిత ఎంగేజ్ మెంట్ జనవరిలో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఎంగేజ్ మెంట్ లో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రక్షిత తండ్రి ఏపీ హైకోర్టు న్యాయవాది. ఆమె తాత ప్రముఖ రాజకీయవేత్త, దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.