మళ్లీ ప్రపంచ నెం.1 అయిన ఎలాన్ మస్క్
- బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్న టెస్లా అధినేత మస్క్
- ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కు నెట్టి తొలి స్థానం కైవసం
- టెస్లా షేర్లు రాణించడంతో పెరిగిన మస్క్ సంపద
- లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో వెనుకబడ్డ బెర్నార్డ్
మరోవైపు, టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ సంపదలో వృద్ధి చోటుచేసుకుంది. మస్క్ ఆస్తుల్లో టెస్లా వాటా ఏకంగా 71 శాతం. ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా షేర్ల ధరలు సుమారు 66 శాతం మేర పెరిగాయి. దీంతో, ఎలాన్ మస్క్ 192.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించారు.
ప్రపంచం ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ క్షిణిస్తోంది. ముఖ్యంగా చైనాలోని ఆర్థికమందగమనం ఎల్వీఎమ్హెచ్ కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.