చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు.. బూతులు తిట్టేవాళ్లను మేమూ తయారు చేస్తాం: కన్నా లక్ష్మీనారాయణ
- సామాజిక న్యాయం చేసింది టీడీపీనే అన్న కన్నా లక్ష్మీనారాయణ
- మహానాడు విజయంతో వైసీపీ నేతల్లో దడ మొదలయిందని వ్యాఖ్య
- నాలుగేళ్ల వైసీపీ పాలనలో బూతులు తప్ప మరేమీ లేదని విమర్శ
నాలుగేళ్ల పాలనలో బూతులు తప్ప వైసీపీ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. బూతులు తిట్టే వారిని తాము కూడా తయారు చేస్తామని అన్నారు. సంపూర్ణ మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, ధరల స్థిరీకరణ నిధి, స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, ఢిల్లీని తలదన్నే రాజధాని, జాబ్ క్యాలెండర్ వంటి జగన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలన చేతకాకపోతే వదిలేసి పారిపోవాలని అన్నారు.