Advertisement

వరుసగా నాలుగో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 123 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 35 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ట్రేడింగ్ చివర్లో లాభాల్లోకి మళ్లిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,969కి చేరుకుంది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18,634 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.08%), కోటక్ బ్యాంక్ (1.06%), బజాజ్ ఫైనాన్స్ (1.02%), యాక్సిస్ బ్యాంక్ (0.90%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.27%), టాటా స్టీల్ (-1.15%), సన్ ఫార్మా (-0.92%), నెస్లే ఇండియా (-0.70%), ఎల్ అండ్ టీ (-0.61%).
Advertisement
Sensex
Nifty
Stock Market

More Telugu News