లెక్క సరిచేసిన సల్మాన్.. విక్కీ కౌశల్ కు ఆత్మీయ హగ్.. ఇదిగో వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లెక్క సరిచేసిన సల్మాన్.. విక్కీ కౌశల్ కు ఆత్మీయ హగ్.. ఇదిగో వీడియో!

After viral push video Salman Khan shares warm hug with Vicky Kaushal at IIFA 2023
  • ఐఫా వేడుకల్లో విక్కీ కౌశల్ ను నెట్టేసిన సల్మాన్ వ్యక్తిగత సిబ్బంది
  • సల్మాన్, ఆయన బాడీ గార్డుల తీరుపై విమర్శలు
  • తాజాగా విక్కీ కౌశల్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా హత్తుకున్న సల్మాన్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా) - 2023 మీడియా సమావేశం సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది.. మరో నటుడు విక్కీ కౌశల్ ను పక్కకు నెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. సల్మాన్ తో మాట్లాడేందుకు విక్కీ ప్రయత్నించడం, వ్యక్తిగత సిబ్బంది పక్కకు తోయడం, విక్కీ మాట్లాడుతున్నా బదులివ్వకుండా సల్మాన్ వెళ్లిపోవడంతో దుమారం రేగింది. సల్మాన్, ఆయన బాడీ గార్డుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

24 గంటలు గడవకముందే మరో వీడియో బయటికి వచ్చింది. ఓ కార్యక్రమంలో ఇద్దరూ వేదికపైనే ఉండగా.. మీడియాతో మాట్లాడుతూ విక్కీ కనిపించారు. ఆయన వద్దకు నేరుగా వెళ్లిన సల్మాన్.. ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇరువురూ నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ వీడియోను సల్మాన్ అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు. 

మరోవైపు ‘తోసేసిన’ ఘటనపై విక్కీ కౌశల్ స్పందించారు. ‘‘కొన్ని సార్లు అనవసర విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి. వీడియోలో కనిపించినట్లుగా అక్కడ అలాంటిదేమీ జరగలేదు. అసలు ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా ఏమీ లేదు’’ అని చెప్పారు. వివాదం పెద్దది కాకుండా చేశారు.
Advertisement
Salman Khan
Vicky Kaushal
IIFA 2023
Salman hugs Vicky Kaushal

More Telugu News