మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi weds Rupali Baruva in the age of 60
  • 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి
  • రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి
  • ఇరువురి మధ్య కొంతకాలంగా ప్రేమ
  • గతంలో నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషితో ఆశిష్ వివాహం
  • వీరికి ఒక కుమారుడు.. పలు కారణాలతో విడిపోయిన ఆశిష్ విద్యార్థి, రాజోషి
బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్తను వివాహమాడారు. ఆమె పేరు రూపాలి బారువా. కాగా, వీరిది రిజిస్టర్ మ్యారేజి. 

కోల్ కతాలోని ఓ ఫ్యాషన్ స్టోర్ వ్యాపారంలో రూపాలి భాగస్వామి అని తెలుస్తోంది. ఆశిష్ విద్యార్థి, రూపాలి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిచింది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరు ప్రేమికులై, పెళ్లితో ఒక్కటయ్యారు. 

ఆశిష్ విద్యార్థికి రెండు దశాబ్దాల కిందట నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి దాంపత్యంలో కలతలు రావడంతో విడిపోయారు. 

ఆశిష్ విద్యార్థి విలనిజంలో తనదైన శైలి కనబరుస్తూ భాషలకు అతీతంగా అభిమానులకు దగ్గరయ్యారు. ఆయన ఇటీవల తెలుగులో రైటర్ పద్మభూషణ్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో హీరో సుహాస్ కు తండ్రి పాత్ర పోషించారు.
Advertisement
Ashish Vidyarthi
Rupali Baruva
Marriage
Actor

More Telugu News