'అన్నమయ్య'లో సుమన్ కంటే ముందు బాలయ్యను అనుకున్నారట!
- 1997లో వచ్చిన 'అన్నమయ్య'
- ఆ పాత్రలో మెప్పించిన నాగార్జున
- ఆయన తొలి భక్తి చిత్రం ఇదే
- వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయిన సుమన్
ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా సుమన్ నటించారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం బాలయ్యను అనుకున్నారట. ఎన్టీఆర్ తరువాత దేవుడి పాత్రలు చేయాలంటే బాలయ్యనే కరెక్ట్ అనే అభిప్రాయం జనంలో ఉంది. ఆయన విగ్రహం అందుకు కరెక్టుగా సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడే ఇంకొక చిక్కు వచ్చి పడింది.
ఈ సినిమాలో అన్నమయ్య .. వేంకటేశ్వరస్వామి పాదాలపై పడవలసిన సన్నివేశం ఉంది. ఈ సీన్ ను నందమూరి అభిమానులు .. అక్కినేని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక అనుమానం వచ్చిందట. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసి, సుమన్ ను సంప్రదించడం జరిగింది. ఆ పాత్రకి సుమన్ ఎంతగా న్యాయం చేశాడనే సంగతి తెలిసిందే.