టీనగర్ చేరుకున్న శరత్ బాబు భౌతికకాయం.. మధ్యాహ్నం అంత్యక్రియలు
- నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన శరత్ బాబు
- చెన్నై టీనగర్ లో ఉన్న నివాసానికి తరలింపు
- నివాళి అర్పిస్తున్న చెన్నైలోని సినీ ప్రముఖులు
శరత్ బాబు భౌతికకాయం చెన్నైలోని టీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది. ఈ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చెన్నైలో ఉన్న పలువురు సినీ ప్రముఖులు శరత్ బాబు నివాసానికి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.