'ఆదికేశవ'గా వైష్ణవ్ తేజ్ .. ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో 'ఆది కేశవ'
- ఆలయం నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా అలరించనున్న శ్రీలీల
- సంగీతాన్ని అందిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్
- జులైలో సినిమా విడుదల
ఈ సినిమాకి 'ఆదికేశవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక క్వారీకి సమీపంలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని కూడా పడగొట్టడానికి కొంతమంది రంగంలోకి దిగుతారు. ఆ శివాయలం జోలికి వచ్చిన వారికి హీరో దేహశుద్ధి చేసి పంపిస్తాడు. ఇదే ఈ గ్లింప్స్ లో చూపించిన కంటెంట్.
రుద్రకాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్ .. అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, జులైలో విడుదల చేయనున్నారు.