ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జూబ్లీహిల్స్ మోతీనగర్‌లో ఉద్రిక్తత
- శతజయంతి ఉత్సావాల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు
- అనుమతి లేదంటూ తొలగించేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ, పోలీసులు
- ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణ
దాంతో, ఎన్టీఆర్ విగ్రహం తొలగించేందుకు సంఘటన ప్రదేశానికి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు భారీగా పోలీసులు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుట్రపూరితంగా ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలోనూ రెండుసార్లు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారంటూ మాగంటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.