‘గాండీవధారి’లో సొంత గొంతు వినిపించనున్న ఏజెంట్ బ్యూటీ

 Agent beauty begins dubbing for her next
  • ఏజెంట్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాక్షి వైద్య
  • ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశ
  • ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన గాండీవధారి అర్జునలో నటిస్తున్న సాక్షి
అక్కినేని అఖిల్‌కి జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్‌’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాక్షి వైద్య. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సాక్షి గ్లామర్‌‌తో ఆకట్టుకుంది. సినిమాపై తను భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. దీంతో చాలా నిరాశ చెందినప్పటికీ సాక్షి ఇప్పుడు మళ్లీ పనిలో పడింది. తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తన రెండో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటోంది. సాక్షి వైద్య  ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘గాండీవధారి అర్జున’లో నటిస్తోంది.

ముంబై భామ సాక్షి ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. మరాఠా వ్యక్తి అయిన సాక్షి తన రెండో చిత్రంలోనే తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. కాగా, గాండీవధారి  సినిమా కొత్త షెడ్యూల్ బుడాపెస్ట్‌లో ఈ రోజు నుంచి మొదలైంది. ఈ షెడ్యూల్ లో వరుణ్‌ తేజ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం కొన్ని రోజుల కిందటే బుడాపెస్ట్ వెళ్లిన వరుణ్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.
Advertisement
agent
akkineni akhil
Varun Tej
sakshi vaidya
dubbing

More Telugu News