నరేశ్, పవిత్ర ‘మళ్లీ పెళ్లి’ డేట్ ఫిక్స్!
- మే 26న నూతన చిత్రం విడుదల
- తన నిజ జీవితాన్నే తెరపై చూపించనున్న నరేశ్
- దర్శకత్వం వహిస్తున్న ఎంఎస్ రాజు
ప్రస్తుతం నరేశ్, నటి పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని నరేశ్ భావిస్తున్నప్పటికీ.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కేసు ఇంకా తేలకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ లోపు తన నిజజీవితాన్నే ఆయన తెరపై చూపే ప్రయత్నం చేస్తున్నారు. రమ్యా రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు.