కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. గ్యారంటీ కార్డ్ పేరుతో మహిళలు, నిరుద్యోగులపై వరాలు!
- ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
- ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
- ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు:
- ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి)
- కుటుంబ పెద్దగా ఉండే మహిళలకు నెలకు రూ. 2 వేలు (గృహలక్ష్మి)
- నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేల భృతి (యువనిధి)
- డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 1,500 (యువశక్తి)
- కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాది లోగా భర్తీ
- ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలు (అన్న భాగ్య).