Chandrababu: రజనీకాంత్ కు చంద్రబాబు తేనీటి విందు... పాల్గొన్న బాలకృష్ణ

Chandrababu tea party to super star rajinikanth
షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో తేనీటి విందును ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు రజనీకాంత్ వచ్చారు.

ఏపీకి వచ్చిన ఆయనను చంద్రబాబు తన నివాసానికి ఆహ్వానించారు. రజనీకాంత్ రాకకు ముందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన దక్షిణాది సూపర్ స్టార్ కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

టీడీపీ అధినేత ఇంట తేనీటి విందులో రజనీకాంత్, నటుడు బాలకృష్ణ, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు రజనీకాంత్ రాష్ట్రానికి వచ్చారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సూపర్ స్టార్ కు బాలకృష్ణ స్వాగతం పలికారు.
Go Back to Shorts
Chandrababu
Rajinikanth

More Telugu News