కుప్పం వ్యవహారాలను కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించిన చంద్రబాబు
Advertisement

కుప్పం వ్యవహారాలను కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించిన చంద్రబాబు

Chandrababu gives Kuppam Charge to Kancharla Sreekanth
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన కంచర్ల శ్రీకాంత్
  • తన నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన చంద్రబాబు
  • 38 మంది సభ్యులతో కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీ
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం కుప్పం బాధ్యతలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ సంచలన విజయాన్ని సాధించారు. ఆయన విజయానికి గుర్తింపుగా తన నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కనీసం లక్ష ఓట్ల మెజార్టీని సాధించాలనే లక్ష్యంతో ఈ కమిటీ పని చేస్తోంది. కంచర్ల శ్రీకాంత్ ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు కుప్పంలోనే బసచేయాలని ఆయన నిర్ణయించారు.
Advertisement
Chandrababu
Telugudesam
Kuppam
Kancharla Sreekanth

More Telugu News