టీడీపీ పాలనలో ఒక్కో విద్యార్థి రూ. 19,500 లబ్ధి పొందగా.. జగన్ వసతి దీవెన రూ. 15 వేలు మాత్రమే: రామానాయుడు
- టీడీపీ హయాంలో విద్యలో ఏపీ 3వ స్థానంలో ఉందన్న రామానాయుడు
- ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయిందని ఎద్దేవా
- దోచుకో, పంచుకో చరిత్ర జగన్ దని విమర్శ
- ఒంటరి వాడినని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య
పులి కథ పేరుతో జగన్ రెడ్డి చెప్పిన పిట్ట కథ ఆయనకే వర్తిస్తుందని రామానాయుడు ఎద్దేవా చేశారు. హత్యల చరిత్ర జగన్ రెడ్డిది కాగా అభివృద్ధి చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. దోచుకో, తినుకో, పంచుకో చరిత్ర జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని అన్నారు. తన అవలక్షణాలను ఎదుటి వారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజమని దుయ్యబట్టారు. తన కేసుల మాఫీ కోసం అప్పర్ భద్ర ద్వారా తుంగభద్రలో రాయలసీమ నీటి హక్కులను కాలరాస్తున్న కర్ణాటకను జగన్ రెడ్డి అడ్డుకోలేదని మండిపడ్డారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తాను ఒంటరి వాడినని జగన్ చెప్పుకోవడం పచ్చి అబద్ధమని... ఆయనకు సాక్షి మీడియా ఎస్టేట్, అబద్దాల కాలుష్యం వెదజల్లే పీకే సోషల్ మీడియా, అలాగే చీకటి పొత్తులు, ధన రాసులు, రౌడీమూక పుష్కలంగా ఉన్నాయని అన్నారు.