ఇండియన్ క్రికెట్లో ఫస్ట్ టైమ్... కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్
- భారత టీ20 క్రికెట్లో ఒకే ఒక్కడు
- ఇటీవల పంజాబ్ పై, నేడు గుజరాత్ టైటాన్స్ పై అదరగొట్టిన కేఎల్ రాహుల్
- 200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డ
- కోహ్లీ, రోహిత్, శిఖర్ ధావన్ కంటే తక్కువ ఇన్నింగ్స్ లలో 7 వేల పరుగులు
200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7000కు పైగా టీ20 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ రాహుల్. ఈ మార్కును చేరుకోవడానికి రాహుల్ 197 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 212 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి... రాహుల్ తర్వాత వేగవంతమైన భారత క్రికెటర్ గా నిలిచాడు. శిఖర్ ధావన్ 246 ఇన్నింగ్స్‌లలో 7000 టీ20 పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు. రోహిత్ శర్మ 258 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో 7000 పరుగులు దాటాడు.