అక్కినేని వారసుడిగా కాదు .. అఖిల్ గా చూడండి: అఖిల్
- అఖిల్ హీరోగా రూపొందిన 'ఏజెంట్'
- స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- వారసత్వం గురించి ప్రస్తావించిన అఖిల్
- తన హార్డ్ వర్క్ ను గుర్తిస్తేనే ఆనందిస్తానని వ్యాఖ్య
ఈ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. " నేను అక్కినేని వారసుడిగా పనిచేయాలనుకోవడం లేదు .. అఖిల్ గా పనిచేయాలని అనుకుంటున్నాను. అక్కినేని వారసుడిగానే పనిచేయాలనుకుంటే, ఒకే రంకంగా పనిచేయవలసి వస్తుంది" అని అన్నాడు.
"వారసత్వం అనే బాధ్యత తప్పకుండా భుజాలపై ఉంటుంది. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆ ట్రాకులోకి వెళ్లిపోతాను. ఒక యాక్టర్ గా హార్డ్ వర్క్ తో నా ప్రోగ్రెస్ ను చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. అఖిల్ గా తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే అది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దాని కోసమే నేను ప్రయత్నిస్తున్నాను .. నా కెరియర్ అంతా ఫైట్ చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.