Kesineni Nani: ఈ దాడి ఒక పిరికిపంద చర్య: కేశినేని నాని

Kesineni Nani fires on Adimulapu Suresh
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతను కల్పించే ఎన్ఎస్జీ సిబ్బంది తమ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టి ఆయనపై రాళ్లు పడకుండా నిలువరించారు. మరోవైపు చంద్రబాబుపై రాళ్ల దాడిని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ వైసీపీ కార్యకర్తలను చంద్రబాబుపై ఉసిగొలిపారని ఆరోపించారు. ఈ దాడిని ఒక పరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను టీడీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
Go Back to Shorts
Kesineni Nani
Chandrababu
Telugudesam
Adimulapu Suresh
YSRCP
Stone Pelting

More Telugu News