మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్‌.. కన్‌ఫ్యూజ్‌ అయిన ఇన్వెస్టర్లు!

Investors Confused by Modis Parle Melody Gift
  • మెలొడీ చాక్లెట్ వీడియోతో పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు
  • ఐదు శాతం పెరిగిన షేరు విలువ
  • మెలొడీ చాక్లెట్‌కు పార్లే ఇండస్ట్రీస్‌కు సంబంధం లేదు
  • చాక్లెట్లు తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లేదు
  • పేరు కన్ఫ్యూజన్‌తో మోసపోయిన ఇన్వెస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని మెలోనికి ‘పార్లే మెలొడీ’ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాను ఎంతగా ఊపేస్తుందో తెలిసిందే. అయితే ఈ వైరల్ వీడియో స్టాక్ మార్కెట్‌లో ఊహించని అలజడి సృష్టించింది. ఒకేలా ఉన్న పేరును చూసి ఇన్వెస్టర్లు తొందరపడి తప్పుడు కంపెనీ షేర్లను కొనేశారు.

షేర్ మార్కెట్లో మెలొడీ మాయ
మోదీ చాక్లెట్ ప్యాకెట్‌ ఇచ్చిన వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే దలాల్ స్ట్రీట్‌లో హల్‌చల్ మొదలైంది. ‘పార్లే ఇండస్ట్రీస్’ అనే కంపెనీ షేర్లు ఇంట్రాడేలో దాదాపు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. గత వారం రోజులుగా ఈ పెన్నీ స్టాక్ ఏకంగా ఏడు శాతం లాభపడింది. అంతా బానే ఉన్నా ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.

కంపెనీ వేరు.. చాక్లెట్ వేరు
మనందరికీ తెలిసిన ఫేమస్ ‘మెలొడీ’ చాక్లెట్‌ను తయారు చేసేది ‘పార్లే ప్రొడక్ట్స్’ అనే ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ. పార్లే-జి బిస్కెట్లు, మొనాకో, మ్యాంగో బైట్ వంటి బ్రాండ్లు అన్నీ ఈ సంస్థవే. ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీ. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కానీ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్లో లిస్టైన ‘పార్లే ఇండస్ట్రీస్’ అనే ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ కంపెనీని చూసి.. అదే చాక్లెట్ కంపెనీ అనుకుని ఎగబడి కొనేశారు.

సోషల్ మీడియా తెచ్చిన తిప్పలు
ట్రెండింగ్‌లో ఉన్న వార్తలను, సెలబ్రిటీల కామెంట్లను చూసి గుడ్డిగా ఇన్వెస్టర్లు ఎలా మోసపోతున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ. సోషల్ మీడియాలో ‘పార్లే మెలొడీ’ ట్రెండ్ అవగానే కనీసం బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోకుండా ట్రేడర్లు మార్కెట్లోకి దూకేశారు. ఇలాంటి తప్పుడు అంచనాల వల్ల తక్కువ ధర ఉండే పెన్నీ స్టాక్స్ ఒక్కోసారి అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి.
Go Back to Shorts
Narendra Modi
Melody chocolate
Parle Products
Parle Industries
Stock market
Share market
Investment
Italian PM Meloni
Dalal Street
FMCG

More Telugu News