భారతీయ రెస్టారెంట్ నిర్వాహకులకు బ్రిటన్ రాకుమారుడి ఊహించని సర్‌ప్రైజ్
Add ap7am to your home Screen

భారతీయ రెస్టారెంట్ నిర్వాహకులకు బ్రిటన్ రాకుమారుడి ఊహించని సర్‌ప్రైజ్

Prince william helps out at indian restaurant during central england visit
  • సెంట్రల్ ఇంగ్లండ్‌‌లో ఇటీవల సతీసమేతంగా బ్రిటన్ రాకుమారుడు విలియమ్ పర్యటన
  • స్థానిక బర్మింగ్‌హామ్‌లో భారతీయ రెస్టారెంట్ సందర్శన
  • టేబుల్ కోసం ఫోన్ చేసిన కస్టమర్‌తో తానే స్వయంగా మాట్లాడి, బుక్ చేసిన రాకుమారుడు
  • వంటకాలు సిద్ధం చేయడంలో విలియమ్, కేట్ దంపతుల సాయం  
సెంట్రల్ ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ను సతీసమేతంగా సందర్శించిన బ్రిటన్ రాకుమారుడు అక్కడి వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. రెస్టారెంట్‌లో టేబుల్‌ బుక్ చేసుకునేందుకు ఫోన్ చేసిన కస్టమర్‌తో తానే స్వయంగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు. వారి పేరిట ఓ టేబుల్ బుక్ చేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్ పూర్తి అడ్రస్‌ను యజమానిని అడిగి తెలుసుకుని మరీ కస్టమర్‌కు చెప్పారు. అయితే, తానెవరో చెప్పకుండానే బ్రిటన్ రాకుమారుడు ఈ సంభాషణ అంతా కొనసాగించారు.

టేబుల్ ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు? అయితే సరే.. రెండు పదిహేను కల్లా ఇక్కడికి వచ్చేయండి! అంటూ కస్టమర్‌తో ప్రిన్స్ విలియమ్ చెప్పారు. ఆ తరువాత రెస్టారెంట్‌లో వంటకాలు సిద్ధం చేయడంలో విలియమ్, కేట్ దంపతులు సాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో చోటుకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రిన్స్ విలియమ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కస్టమర్‌కు సరైన అడ్రస్సే చెప్పామనుకుంటున్నాం అంటూ ఓ సరదా కామెంట్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
Advertisement
Prince William
UK

More Telugu News