Vishnu Vardhan Reddy: మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారూ... బీఆర్ఎస్ పార్టీలో చేరండి: విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యం

Vishnu Vardhan Reddy satires in VV Lakshminarayana
షార్ట్స్‌లో చూడండి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ నిర్ణయం వల్లే కేంద్రం మనసు మార్చుకుందని, అందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటన చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ కుటుంబంపైనా ప్రేమ ఉండొచ్చని, ఆయన తన సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చని తెలిపారు. 

"లక్ష్మీనారాయణ గారూ, మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినా మాకు అభ్యంతరం లేదు. అయితే మీరు ఏపీ ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. నీటిపారుదల అంశంలో ఏపీపై కేసుల సంగతి ఏంటి? ఏపీకి చెల్లించాల్సిన పెండింగ్ సొమ్ము ఎంత? ఎందుకు చెల్లించడంలేదు? ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు చేసిన దాడి సంగతేంటి?" అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 

"కేసీఆర్ గనుక నిజంగానే ఏపీ శ్రేయోభిలాషి అయ్యుంటే ఇవన్నీ చేసి ఉండేవాడు కాదు. మీ రాజకీయాల కోసం మీరు ఏపీ ప్రజలను అవమానిస్తున్నారు" అని విమర్శించారు.
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
VV Lakshminarayana
KCR
Vizag Steel Plant
Andhra Pradesh
BJP
BRS
Telangana

More Telugu News