హార్దిక్ పాండ్యా పునరాగమనం... టాస్ గెలిచిన టైటాన్స్
- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీ
షమీ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ మిడ్ వికెట్ లో రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 16 పరుగులు కాగా... క్రీజులో ఓపెనర్ శిఖర్ ధావన్ (8 బ్యాటింగ్), మాథ్యూ షార్ట్ (8 బ్యాటింగ్) ఆడుతున్నారు.
కాగా, గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడని విషయం తెలిసిందే. అయితే, అతడి స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.