Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి మధ్యంతర పిటిషన్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. 

ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.
Avinash Reddy
Interim Petition
Telangana High Court
CBI
Viveka Murder Case
YSRCP
Andhra Pradesh

More Telugu News