పార్లమెంటు వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా
- నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం
- పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సెలెబ్రేట్ చేసుకున్న టీడీపీ ఎంపీలు
- టీడీపీ ఎంపీలను కలిసి శుభాకాంక్షలు తెలిపిన నడ్డా
ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడకు చేరుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాజ్ పేయి హయాంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అనుబంధాన్ని నడ్డాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. టీడీపీతో బీజేపీకి ఉన్న సంబంధాలు తనకు తెలుసని చెప్పారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకుని గెలిచాయి. ఈ సందర్బంగా టీడీపీ అభ్యర్థికి నడ్డా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.