కవిత పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. మళ్లీ పెరిగిన టెన్షన్
- మహిళను విచారించే విధానంపై ఈడీకీ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్
- విచారణను 27వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
- ఈలోగా ఆమెను ఈడీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ ప్రచారం
అయితే, విచారణ తేదీని తాజాగా 27కి మార్చింది. ఈ నెల 27న జస్టిస్ అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది. మరోవైపు ఈడీ విచారణకు కవిత హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ ను 27న విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పడంతో... ఈలోగా ఆమెను ఈడీ మరోసారి విచారణకు పిలవొచ్చనే చర్చ ప్రారంభమయింది.