ఆస్కార్ వేదికపై ఎగిరిన తెలుగు జెండా.. అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

ఆస్కార్ వేదికపై ఎగిరిన తెలుగు జెండా.. అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్.. వీడియో ఇదిగో!

Keeravani and Chandrabosr receives Oscar awards
  • నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు
  • అవార్డు ప్రకటనతో దద్దరిల్లిన థియేటర్
  • సగర్వంగా అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్
సినీ ప్రపంచంలో తెలుగు జెండా సగర్వంగా రెపరెపలాడింది. తెలుగు సినిమా కీర్తి దిగంతాలకు ఎదిగింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట బెస్ట్ సాంగ్ అవార్డును సాధించింది. ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లింది. లైవ్ లో చూస్తున్న కోట్లాది మంది అభిమానులు ఆనందంతో పులకించిపోయారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.  

Advertisement
Oscars
RRR
Natu Natu
Tollywood
Bollywood
Keeravani
Chandrabose

More Telugu News