హాలీవుడ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
Add ap7am to your home Screen

హాలీవుడ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan about acting in Hollywood movies
  • కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయన్న రామ్ చరణ్
  • రెండు నెలల్లో గుడ్ న్యూస్ ఉంటుందని వెల్లడి
  • గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో నటించాలని ఉందని వ్యాఖ్య
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు హాలీవుడ్ లో మారుమోగుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఆయన నటనకు... నాటునాటు సాంగ్ లో ఆయన డ్యాన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ కు అక్కడి మీడియా ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటికే పలు మీడియా సంస్థలు, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా సామ్ ఫ్రాగోసో నిర్వహిస్తున్న 'టాక్ ఈజీ' షో 320 ఎపిసోడ్ లో రామ్ చరణ్ మాట్లాడారు. 

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయిందని చరణ్ చెప్పారు. అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ ఆస్కార్స్ లో 'ఆర్ఆర్ఆర్' గుర్తింపు పొందడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించే అంశంపై ఆయన మాట్లాడుతూ... కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు కొనసాగుతున్నాయని... మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ ఉంటుందని తెలిపారు. గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో తాను నటించాలనుకుంటున్నానని చెప్పారు.
Advertisement
Ramcharan
Tollywood
Bollywood
Hollywood
RRR

More Telugu News