Mumbai Indians: డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బోణీ

Mumbai Indians victorious in inaugural WPL first match
షార్ట్స్‌లో చూడండి
ముంబయిలో ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్ తో ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 143 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

తొలుత బ్యాటింగ్ లో విరుచుకుపడిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఆపై, గుజరాత్ జెయింట్స్ ను కుప్పకూల్చింది. 208 పరుగుల భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 15.1 ఓవర్లలో కేవలం 64 పరుగులు మాత్రమే చేసి దారుణ పరాజయాన్ని చవిచూసింది. 

ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దయాలన్ హేమలత చేసిన 29 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో సలికా ఇషాక్ 4 వికెట్లు తీయగా, నాట్ షివర్ 2, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Mumbai Indians
Gujarat Giants
WPL
Mumbai

More Telugu News