భార్య, పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్

Actor Nawazuddin sent out his wife from home
  • నవాజ్ తనను హింసిస్తున్నాడన్న అలియా
  • తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన
  • పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన వైనం
బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ పాత్రకు జీవం పోయడంలో ఆయన దిట్ట. సినీ అభిమానుల్లో కూడా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది. ఇంత పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న నవాజుద్దీన్... తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విమర్శలపాలయ్యాడు. 

నవాజుద్దీన్ తనను ఎంతో హింసిస్తున్నాడని ఆయన భార్య అలియా సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేసింది. అంతేకాదు తనను చిత్రవధ చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమెను నవాజుద్దీన్ కొన్ని రోజులుగా ఇంట్లోనే బందీని చేశాడట. తాజాగా భార్య, పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 

తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లొచ్చేసరికి ఆయన కాపలాదారులు తనను ఇంట్లోకి రానివ్వలేదని ఆమె తెలిపింది. అంతేకాదు తన పిల్లలతో కలిసి గేటు బయట ఆమె ఏడుస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. తనను, పిల్లలను నవాజ్ రోడ్డు మీద నిలబెట్టాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపింది.
Go Back to Shorts
Nawazuddin
Bollywood
wife

More Telugu News