Tarakaratna: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

Tarakaratna last rites concludes
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల నడుమ అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంతిమయాత్ర ఫిలించాంబర్ నుంచి ప్రారంభమైంది. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 

మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు తారకరత్న భౌతికకాయానికి కడసారి నివాళులు అర్పించారు. తారకరత్న చితికి ఆయన తండ్రి మోహనకృష్ణ నిప్పంటించారు. తారకరత్న అంతిమసంస్కారాలను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు.
Go Back to Shorts
Tarakaratna
Funeral
Last Rites
Hyderabad

More Telugu News