మహాశివరాత్రికి అమెజాన్ ప్రైమ్‌ - ఆహాల‌లో ‘లక్కీ లక్ష్మణ్’
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహాశివరాత్రికి అమెజాన్ ప్రైమ్‌ - ఆహాల‌లో ‘లక్కీ లక్ష్మణ్’

Lucky Lakshman movie
  • సోహెల్ హీరోగా రూపొందిన 'లక్కీ లక్ష్మణ్'
  • కథానాయికగా మోక్ష పరిచయం
  • దర్శకుడిగా అభికి ఇది ఫస్టు మూవీ   
  • తండ్రీ కొడుకుల అనుబంధమే ప్రధానమైన కథాంశం
బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. హ‌రిత గోగినేని నిర్మించిన ఈ సినిమాకి అభి దర్శ‌క‌త్వం వహించాడు. డిసెంబర్ 30న సినిమా థియేటర్స్‌లో సంద‌డి చేసిన ఈ సినిమా, ఆడియెన్స్‌కు ఇప్పుడు మ‌రింత చేరువ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ‌లు అమెజాన్ ప్రైమ్‌ - 'ఆహా'ల్లో మ‌హా శివరాత్రి సంద‌ర్భంగా స్ట్రీమింగ్ అవుతోంది. 

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ల‌క్ష్మ‌ణ్ (స‌య్య‌ద్ సోహైల్‌). ఆర్థిక ప‌రిస్థితి బాగోలేని కారణంగా, అతను ఏది అడిగినా తండ్రి కొనివ్వ‌లేడు. దాంతో ల‌క్ష్మ‌ణ్‌ చాలా అసంతృప్తికి లోనవుతాడు.  ఇంజ‌నీరింగ్ చ‌దివే స‌మ‌యంలో శ్రియ (మోక్ష‌)తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. తండ్రిపై ఉన్న కోపంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ల‌క్ష్మ‌ణ్ కి శ్రియ సాయం చేస్తుంటుంది. 

స్నేహితుల సాయంతో సొంతంగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్ అందులో బాగా డ‌బ్బులు సంపాదిస్తాడు. డబ్బులున్నాయ‌నే పొగ‌రుతో ప్రేమ‌ను కాద‌నుకుంటాడు. తల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోడు. ఆ తరువాత జరిగిన ఒక అనూహ్యమైన సంఘటనతో తండ్రి గొప్ప‌త‌నాన్ని, త‌న కోసం ఆయన చేసిన త్యాగాన్ని తెలుసుకుని షాక‌వుతాడు. హీరోకి, త‌న తండ్రికి ఉన్న ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా  నిలుస్తాయి .. హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తాయి. ఈ శివ‌రాత్రికి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ లోను .. ఆహాలోను చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement
Sohel
Moksha
Lucky Lakshman Movie

More Telugu News